కేరళ ముఖ్యమంత్రి గా ఎవరిని నియమిస్తారనే విషయంపై కమ్మూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఎం) స్పష్టతనిచ్చింది.
కేరళకు ఆయనే ఫిడెల్ కాస్ట్రో
May 20 2016 7:00 PM | Updated on Sep 4 2017 12:32 AM
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి గా ఎవరిని నియమిస్తారనే విషయంపై కమ్మూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఎం) స్పష్టతనిచ్చింది. 92 ఏళ్ల వయసున్న వీఎస్ అచ్యుతానందన్(వీఎస్) ను నియమించే ఉద్దేశం పార్టీకి లేదని సీపీఎం జనరల్ సెక్రెటరీ సీతారాం ఏచూరి వ్యాఖ్యలతో స్పష్టమైంది.
వీఎస్ ఆయన క్యూబా మాజీ ప్రెసిడెంట్ ఫిడేల్ కాస్ట్రోతో పోల్చారు. కామ్రెడ్ వీఎస్ ఫెడరల్ కాస్ట్రో లలాగా ప్రభుత్వానికి సలహా దారుగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. కేరళ సీఎంగా పినరయి విజయన్ ను నియమించాలని పార్టీ నిర్ణయించినట్టు ఏచూరి స్పష్టం చేశారు. వీఎస్,విజయన్ లు కేరళ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement