సుఖోయ్‌కు బ్రహ్మోస్‌

Work to integrate Brahmos on 40 Sukhoi aircraft begins - Sakshi

అమర్చే ప్రక్రియ షురూ!

న్యూఢిల్లీ: రష్యన్‌ తయారీ సుఖోయ్‌–30 యుద్ధవిమానాల్లో సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌ను అమర్చే ప్రక్రియ ప్రారంభమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు 40 సుఖోయ్‌ యుద్ధవిమానాలకు ఈ క్షిపణుల్ని అమర్చనున్నట్లు వెల్లడించాయి. ఈ ప్రక్రియ 2020 నాటికల్లా పూర్తికావొచ్చన్నాయి. సుఖోయ్‌–30 యుద్ధవిమానం ద్వారా తొలిసారి బ్రహ్మోస్‌ను నవంబర్‌ 22న ప్రయోగించిన సంగతి తెలిసిందే.

సుఖోయ్‌ల్లో బ్రహ్మోస్‌ క్షిపణుల్ని అమర్చే ప్రక్రియను ప్రభుత్వరంగ సంస్థ హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ చేపట్టింది. తాజాగా సుఖోయ్‌ యుద్ధవిమానాల్లో ఈ మార్పులు చేపడితే.. సముద్రంపై, భూభాగాలపై ఉన్న సుదూర లక్ష్యాల్ని ఛేదించగల సామర్థ్యం వాయుసేనకు సమకూరుతుంది. భారత్‌–రష్యా రూపొందించిన బ్రహ్మోస్‌ క్షిపణి ధ్వనికంటే 3 రెట్లు వేగంగా దూసుకుపోతుంది. 2.5 టన్నుల బరువున్న ఈ క్షిపణి 290 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top