జంతర్ వద్ద చెట్టెక్కి మహిళ హల్చల్ | Woman Climbs Tree at Jantar Mantar Threatening Suicide | Sakshi
Sakshi News home page

జంతర్ వద్ద చెట్టెక్కి మహిళ హల్చల్

Aug 8 2016 7:17 PM | Updated on Sep 4 2017 8:25 AM

జంతర్ మంతర్ వద్ద ఓ 50 ఏళ్ల మహిళ హల్ చల్ చేసింది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ అక్కడ చెట్టు ఎక్కి కూర్చుంది.

న్యూఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద ఓ 50 ఏళ్ల మహిళ హల్ చల్ చేసింది. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ అక్కడ చెట్టు ఎక్కి కూర్చుంది. తన కుమారుడిని చంపిన హంతకులను వెంటనే అరెస్టు చేసి చర్యలు తీసుకోకుంటే తాను ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. బిహార్కు చెందిన బచ్చా దేవీ (50) అనే మహిళ ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంటోంది.

2015 అక్టోబర్ లో బిహార్ లో తన కుమారుడిని కొందరు వ్యక్తులు హత్య చేశారని, ఆ నేరస్తులపై ఇంత వరకు చర్యలు తీసుకోలేదని గుర్తుచేస్తూ వారిపై చర్యలు డిమాండ్ తో ఆమె ఓ చెట్టు ఎక్కింది. ఢిల్లీకి వచ్చి నాయకులను కలవడం ద్వారా తనకు న్యాయం జరుగుతుందని భావించినట్లు తెలిపింది. తొలుత చుట్టుపక్కల వారు ఎంత బ్రతిమాలినా చెట్టుదిగని ఆమె అనంతరం పోలీసులు జోక్యం చేసుకున్న తర్వాత కిందికొచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement