మొబైల్‌ చూస్తూ కాలు పోగొట్టుకుంది! | Woman in China has her leg cut off by lift doors | Sakshi
Sakshi News home page

మొబైల్‌ చూస్తూ కాలు పోగొట్టుకుంది!

Jan 3 2018 2:07 PM | Updated on Jan 3 2018 2:10 PM

Woman in China has her leg cut off by lift doors - Sakshi

షాంఘై : స్మార్ట్‌ ఫోన్‌ జీవితంలో ఒక భాగం అయిపోయింది. చేతిలో ఫోన్‌ ఉటే చాలు.. పక్కన ఏం జరుగుతోందన్న విషయాన్ని కూడా జనాలు గమనించడం లేదు. స్మార్ట్‌ మాయలో కొట్టుకుతున్న కుర్రకారు.. కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. ఇటువంటి ఘటనే చైనాలోని షాంఘైలో జరిగింది. స్మార్ట్‌ ఫోన్‌ మాయలో ఏం జరుగుతోందో కూడా పట్టించుకోక.. చివరకు అత్యంత దారుణ స్థితిలో కాలును కోల్పోయింది. 

షాంఘైలోని ఒక ప్రయివేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్న 28 ఏళ్ల యువతి ఆఫీస్‌ అయిపోయాక ఇంటికి వెళ్లే క్రమంలో లిఫ్ట్‌ దగ్గరకు వచ్చింది. అంతలోనే స్మార్ట్‌ ఫోన్‌ చూసుకుంటూ.. అడుగులు ముందుకు వేసింది. మొబైల్‌ చూసుకుంటూనే... లిఫ్ట్‌లోపలకు అడుగులు వేసింది. అయితే అప్పటికే లిఫ్ట్‌ డోర్లు మూసుకుపోతున్నాయి. ఈ విషయాన్ని గమనించని యువతి అలాగే లోపలకి వెళ్లింది. ఈ క్రమంలో ఆమె ఒక కాలు బయట ఉండగానే లిఫ్ట్‌ వేగంగా కదిలింది. లిఫ్ట్‌ వేగం అందుకోవడంతో.. ఆమె కాలు.. అక్కడే పచ్చడి అయిపోయింది. ఈ ఘటన మొత్తం సీసీటీవీలో రికార్డవడంతో.. వెలుగులోకి వచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement