'నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను' | Will Not Contest Elections Again, Says Kiran Bedi | Sakshi
Sakshi News home page

'నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను'

May 11 2015 10:03 AM | Updated on Mar 29 2019 9:31 PM

'నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను' - Sakshi

'నేను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను'

ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా పోటీ చేసి పరాభావం ఎదుర్కొన్న తొలి మహిళ పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడీకి ఎన్నికలపై ఆసక్తి తగ్గినట్లుంది. ఇక ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని ఆమె తాజాగా స్పష్టం చేయడమే అందుకు ప్రధాన కారణం.

పనాజీ: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా పోటీ చేసి పరాభావం ఎదుర్కొన్న తొలి మహిళ పోలీస్ ఆఫీసర్ కిరణ్ బేడీకి రాజకీయాలపై ఆసక్తి తగ్గినట్లుంది. ఇక ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని ఆమె తాజాగా స్పష్టం చేయడమే అందుకు ప్రధాన కారణం. కాగా తనకు ప్రజా సేవ చేయాలని ఉందని మాత్రం ఆమె తెలియజేశారు. అయితే అందుకు క్రియాశీల రాజకీయాలను మాత్రం ఎంచుకోనని అన్నారు.

 

'నేను ప్రజా సేవచేయడానికి మళ్లీ  వస్తున్నా. కానీ రాజకీయాల్లోకి రాను. రాజకీయం అనేది నా  భాష కాదు. అందుచేత తిరిగి ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదు'అని తెలిపారు. వుమెన్ ఎకానిమిక్ ఫోరం కార్యక్రమంలో భాగంగా ఆదివారం పనాజీకి వచ్చిన కిరణ్ బేడీ.. ఢిల్లీ రాజకీయాలపై అడిగిన మీడియా ప్రశ్నలకు పై విధంగా స్పందించింది.  తన జీవితం పలు విషయాల్లో ఉన్నతస్థితిలోనే సాగిందన్నారు. కాగా ఢిల్లీ ఎన్నికలు అనేవి తన జీవితంలో ఒక మరిచిపోలేని అనుభూతిగా ఆమె అభివర్ణించారు. బీజేపీ ఇచ్చిన ఆ అవకాశం తన జీవితానికి ఎంతోగానో ఉపయోగపడిన కారణంగా ధన్యవాదాలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement