
బోయపాటి శ్రీను హీరోలు టఫ్‌గా ఉంటారు. కండలు తిరిగిన శరీరంతో, కత్తులు దూస్తూ మాస్ అభిమానులు కోరుకునేట్టుగా. ఆయన నెక్ట్స్ చిత్రం ఫస్ట్ లుక్ కూడా అదే రేంజ్‌లో ఉంది. రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వినయ విధేయ రామ’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ని దీపావళి సందర్భంగా మంగళవారం రిలీజ్ చేశారు.
టైటిల్ సాఫ్ట్‌గా ఉన్నా దర్శకుడు బోయపాటి మార్క్ ఈ ఫస్ట్ లుక్‌లో కనిపిస్తోంది. లక్షణాల్లో వినయ విధేయతలు చూపెట్టేలా హీరో క్యారెక్టర్ ఉంటుందని ఊహించవచ్చు. అలాగే తేడా వస్తే విధ్వంసం సృష్టించడానికి వెనకాడడని అనుకోవచ్చు. ‘‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ‘వినయ విధేయ రామ’ వస్తున్నాడు. సంక్రాంతికి కలుద్దాం’’ అని చిత్రబృందం పేర్కొంది. స్నేహ, ఆర్యన్ రాజేశ్, వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.