సివిల్స్ మెయిన్స్ ఫలితాల విడుదల | UPSC declares results of civil services mains | Sakshi
Sakshi News home page

సివిల్స్ మెయిన్స్ ఫలితాల విడుదల

Mar 12 2014 4:56 AM | Updated on Sep 2 2017 4:35 AM

సివిల్స్ మెయిన్స్ ఫలితాల విడుదల

సివిల్స్ మెయిన్స్ ఫలితాల విడుదల

సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షల ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం ప్రకటించింది.

న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ మెరుున్స్ పరీక్షల ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) మంగళవారం ప్రకటించింది. విజేతలైన అభ్యర్థులను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)లతో పాటు గ్రూప్ ఏ, బీ కేంద్ర సర్వీసులకు ఎంపిక చేసేందుకు గాను ఇంటర్వ్యూలకు (పర్సనాలిటీ టెస్ట్) పిలువనుంది. విజేతలైన అభ్యర్థుల రోల్ నంబర్లను కమిషన్ వెబ్‌సైట్ ఠీఠీఠీ.ఠఞటఛి.జౌఠి.జీలో చూడవచ్చు. ఏప్రిల్ 7 నుంచి ఇంటర్వ్యూలు మొదలయ్యే అవకాశం ఉందని సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
 
  ఢి ల్లీలోని సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరుగుతాయని, తేదీ, సమయం విజేతలైన అభ్యర్థులకు వ్యక్తిగతంగా తెలియజేస్తామని పేర్కొంది. అభ్యర్థులు తమ వయసు, విద్యార్హతలు, కులం, వైకల్యానికి (ఉంటే) సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను క్వశ్చనీర్, అటెస్టేషన్ ఫామ్, టీఏ వంటి ఇతర పత్రాలతో కలిపి సమర్పించాల్సి ఉంటుందని ప్రకటన వివరించింది. ఈ పత్రాలన్నిటికీ సంబంధించిన ఫార్మాట్‌లను యూపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపింది. ఇంటర్వ్యూ తేదీ, సమయం మార్పుకు సంబంధించిన ఎలాంటి వినతులనూ పరిశీలించడం జరగదని స్పష్టం చేసింది. ఇంటర్వ్యూలకు అర్హత సాధించని అభ్యర్థుల మార్కుల జాబితాలను ఇంటర్వ్యూలు ముగిసిన 15 రోజుల్లోగా యూపీఎస్సీ వెబ్‌సైట్ పెట్టనున్నట్టు వివరించింది. గత ఏడాది డిసెంబర్‌లో యూపీఎస్సీ మెరుున్స్ రాతపరీక్షను నిర్వహించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement