జైలు వ్యాన్ను ఢీకొన్న పోలీస్ జీప్ | Two cops killed, four injured in road accident | Sakshi
Sakshi News home page

జైలు వ్యాన్ను ఢీకొన్న పోలీస్ జీప్

Aug 20 2016 5:17 PM | Updated on Aug 21 2018 9:00 PM

పోలీసులు ప్రయాణిస్తున్న జీపు.. ఖైదీలను తరలిస్తున్న జైలు వ్యాన్ను ఢీకొంది.

ఘాజీపూర్: పోలీసులు ప్రయాణిస్తున్న జీపు.. ఖైదీలను తరలిస్తున్న జైలు వ్యాన్ను ఢీకొంది. ఉత్తర ప్రదేశ్లోని ఘాజీపూర్లో శనివారం జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో జీపులో వెళ్తున్న ఇద్దరు పోలీసులు అక్షయ్ కుమార్(45), ఇంద్రదేవ్ ఉపాధ్యాయ(50) మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. డియోరియా కోర్టుకు జైలు వ్యాన్లో ఖైదీలను తరలిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో జైలు వ్యాన్లో ప్రయాణిస్తున్న ఖైదీలతో పాటు.. పాటు వారిని తరలిస్తున్న పోలీసులు క్షేమంగా బయటపడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement