బీజేపీ ఎంపీ వాహనంపై దాడి

Tmc Workers Ransacked Bjp Mps Vehicle In West Bengal - Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ బీజేపీ చీఫ్‌ దిలీప్‌ ఘోష్‌పై దాడి ఘటన మరువకముందే మరో బెంగాల్‌ నేతపై తృణమూల్‌ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. బరక్‌పూర్‌ ఎంపీ అర్జున్‌ సింగ్‌ ప్రయాణిస్తున్న వాహనంపై ఆదివారం మధ్యాహ్నం కొందరు తృణమూల్‌ కార్యకర్తలు దాడికి పాల్పడి వాహనాన్ని ధ్వంసం చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లా శ్యామ్‌నగర్‌లోని ఫీడర్‌ రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ, తృణమూల్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తగా పోలీసులు జరిపిన లాఠీచార్జిలో బీజేపీ ఎంపీ అర్జున్‌ సింగ్‌కు తలపై గాయాలయ్యాయి. పలువురు బీజేపీ కార్యకర్తలపైనా పోలీసులు లాఠీలు ఝళిపించారు. కాగా బరక్‌పూర్‌ పోలీస్‌ కమిషనర్‌ మనోజ్‌ వర్మ తన తలపై లాఠీతో బలంగా కొట్టారని, బీజేపీ కార్యకర్తలనూ ఆయన చితకబాదారని ఎంపీ అర్జున్‌ సింగ్‌ ఆరోపించారు. బీజేపీ ఎంపీ కారును తృణమూల్‌ కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top