ఎస్పీపై దాడి చేసింది ఈ ఉగ్రవాదులే! | terrorists first attacked an sp in punjab, snatched his vehicle | Sakshi
Sakshi News home page

ఎస్పీపై దాడి చేసింది ఈ ఉగ్రవాదులే!

Jan 2 2016 7:51 AM | Updated on Sep 3 2017 2:58 PM

ఎస్పీపై దాడి చేసింది ఈ ఉగ్రవాదులే!

ఎస్పీపై దాడి చేసింది ఈ ఉగ్రవాదులే!

పంజాబ్ కేడర్‌కు చెందిన ఒక ఎస్పీని ఉగ్రవాదులు శుక్రవారం నాడు తీవ్రంగా కొట్టి.. ఆయన వాహనాన్ని లాక్కున్నారు. అందులోనే ఉగ్రవాదులు వచ్చి ఉంటారని ఇప్పుడు అందరూ భావిస్తున్నారు.

పంజాబ్ కేడర్‌కు చెందిన ఒక ఎస్పీని ఉగ్రవాదులు శుక్రవారం నాడు తీవ్రంగా కొట్టి.. ఆయన వాహనాన్ని లాక్కున్నారు. ఆ వాహనం ఎయిర్‌బేస్‌కు 1.5 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి సమీపంలో ఉన్న గ్రామంలో వదిలేసి ఉంది. అందులోనే ఉగ్రవాదులు వచ్చి ఉంటారని ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. తొలుత ఎవరైనా దోపిడీ దొంగలు ఈ పనికి పాల్పడి ఉంటారని అనుకున్నారు. దొంగలు పంజాబ్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారిని దోచుకున్నారనే మీడియా కథనాలు కూడా వచ్చాయి. ఆ ఘటనను ఎవరూ పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం ఎస్పీపై దాడి చేసింది ఉగ్రవాదులేనన్న విషయం స్పష్టమైంది.

పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ మీద దాడికి ప్రయత్నించిన ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్ నుంచి వచ్చినట్లు స్పష్టమైంది. దీన్ని బట్టి పాక్ ఉగ్రవాద మూకలు ఇంకా భారతదేశాన్ని తమ  టార్గెట్ చేయడం మానలేదని అర్థమవుతోంది. పఠాన్‌కోట్ ప్రాంతం కూడా పాక్ సరిహద్దుకు దగ్గరగానే ఉండటంతో, భారత ఆర్మీ యూనిఫాం ధరించి ఏకే 47లతో వచ్చారు.

గతంలో కూడా నలుగురు ఉగ్రవాదులు పాకిస్థాన్ నుంచి సరిహద్దు దాటి పంజాబ్‌లోకి వచ్చి, పోలీసు స్టేషన్ మీద దాడిచేసిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పుడు కూడా ఇద్దరు అర్ధరాత్రి 2.30 గంటల ప్రాంతంలో వాళ్లు పఠాన్‌కోట్ చేరుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్‌కౌంటర్ కొనసాగుతూనే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement