
పట్నా : బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకున్న అల్లర్లకు ఆర్‌ఎస్‌ఎస్ కారణమని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ బీహార్‌లో 14 రోజులు పర్యటించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఎలా అల్లర్లు సృష్టించాలో వారి కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. ఈ అల్లర్లతో భగవత్ పర్యటన ఉద్దేశం ఏమిటో ప్రజలుకు అర్థమైపోయింది’ అని పేర్కొన్నారు.
కాగా, ఇక గతవారం భగల్పూర్ జిల్లాలో చోటు చేసుకున్న అల్లర్లు ఇతర నగరాలకు పాకాయి. ఈ రోజు నవడా పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు హనుమంతుడి విగ్రహం ధ్వంసం చేయడంతో రెండు వర్గాల మధ్య అల్లర్లు చెలరేగాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు.