అయ్యప్ప స్వామి జోలపాట రీరికార్డింగ్‌ | TDB to rerecord Lord Ayyappa’s lullaby | Sakshi
Sakshi News home page

అయ్యప్ప స్వామి జోలపాట రీరికార్డింగ్‌

Nov 20 2017 3:33 AM | Updated on Nov 20 2017 3:33 AM

TDB to rerecord Lord Ayyappa’s lullaby - Sakshi

తిరువనంతపురం: కేరళలోని శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని నిద్ర పుచ్చేందుకు వినిపించే ‘హరివరాసనమ్‌’ పాటను మళ్లీ రికార్డు చేయాలని ఆలయాన్ని పర్యవేక్షిస్తున్న ట్రావెన్‌ కోర్‌ దేవస్థానం బోర్డు(టీడీబీ) నిర్ణయించింది. ఎనిమిది చరణాల సమాహారమైన ఈ గీతంలోని ప్రతీ లైనులో ‘స్వామి’ పదాన్ని చేర్చనున్నారు. ప్రముఖ గాయకుడు కె.జె ఏసుదాస్‌ ఆలపించిన గీతాన్నే వినియోగిస్తున్నారు. ఈ గీతంలో వచ్చే ‘అరివిమర్ధనం’ పదాన్ని ‘అరి’(శత్రువు), ‘విమర్ధనం(నాశనం)’గా విడగొట్టేందుకు నిర్ణయించినట్లు కుమార్‌ వెల్లడించారు. 1950 నుంచి ఈ గీతాన్ని స్వామి నిద్రా సమయంలో వినిపిస్తున్నారు.

శబరిమలలో ఏపీ మహిళను అడ్డుకున్న పోలీసులు
శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి యత్నించిన ఓ మహిళను పోలీసులు అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పార్వతి(31) భర్త, పిల్లలు, మరో 11 మందితో కలిసి ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించారని పోలీసులు తెలిపారు. శబరిమలలో 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల ప్రవేశంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement