శబరిమల బంగారం కేసు.. ప్రధాన నిందితుడు అరెస్ట్‌ | Sabarimala Gold Plating Case: Prime Accused Unnikrishnan Potti Arrested by SIT After 10-Hour Interrogation | Sakshi
Sakshi News home page

శబరిమల బంగారం కేసు.. ప్రధాన నిందితుడు అరెస్ట్‌

Oct 17 2025 12:19 PM | Updated on Oct 17 2025 12:34 PM

Sabarimala Gold Theft Case Unnikrishnan Potti Arrest

తిరువనంతపురం: శబరిమల(Sabarimala) ఆలయంలో విగ్రహాల బంగారం తాపడం విషయంలో ఇప్పటికే పలు ట్విస్టులు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో తాజాగా ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్​ పొట్టిని(Unnikrishnan Potti) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు శుక్రవారం అరెస్ట్​ చేశారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం కోర్టు ముందు ఉన్నికృష్ణన్‌ను హాజరుపరచనున్నారు.

కాగా, బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్​ పొట్టిని ఆయన ఇంట్లో (పులిమత్‌లో) అదుపులోకి తీసుకున్నట్లు (సిట్)​ అధికారులు తెలిపారు. అనంతరం, తిరువనంతపురంలోని క్రైమ్ బ్రాంచ్​ కార్యాలయంలో విచారించారని సిట్​ వర్గాలు తెలిపాయి. శుక్రవారం మధ్యాహ్నం కోర్టు ముందు ఆయన్ను హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ కోసం సిట్ ఆయన్ను కస్టడీకి కోరే అవకాశం ఉంది. మరోవైపు.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అసిస్టెంట్​ ఇంజనీర్​ కె.సునీల్​ కుమార్‌ను ట్రావెన్‌కోర్‌​ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్​ ప్రశాంత్​ గతంలో సస్పెండ్​ చేశారు. కాగా, ఈ వివాదంలో ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్న రిటైర్డ్​ అధికారులకు షోకాజ్​ నోటీసులు పంపనున్నట్లు తెలిపారు. పది రోజుల్లోగా నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు.

జరిగింది ఇదీ.. 
శబరిమలలో గర్భగుడి ముందున్న ద్వారపాలక విగ్రహాలపై బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించడం జరిగింది. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ఉన్నికృష్ణన్‌ అనే దాత తీసుకెళ్లారు. ఈ పనిని చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. 2019లో వాటిని తొలగించే సమయంలో తాపడాల బరువు 42.8 కిలోలుగా ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే, ఆ తాపడాలను తమ వద్దకు తెచ్చినప్పుడు బరువు 38.28 కిలోలు మాత్రమే ఉందని సదరు కంపెనీ పేర్కొంది.

అంతేగాక, ఆలయం నుంచి తాపడాలను తొలగించిన దాదాపు 40 రోజుల తర్వాత వాటిని చెన్నైలోని కంపెనీకి అందించినట్లు సమాచారం. ఈ పరిణామాలపై ఇప్పటికే హైకోర్టు పలు అనుమానాలు వ్యక్తంచేసింది. ఉన్నట్లుండి తాపడాల బరువు 4.524 కేజీలు తగ్గడాన్ని తీవ్రంగా పరిగణించింది. వీటిని తిరిగి అమర్చినప్పుడు ఎందుకు బరువును సరిచూడలేదని ప్రశ్నించింది. అలాగే ముందుస్తు అనుమతి తీసుకోకుండా ద్వారపాలక విగ్రహల బంగారు తాపడాలను మరమ్మతుల నిమిత్తం తొలగించడం పైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై క్రిమినల్​ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ వివాదంపై ఇప్పటికే న్యాయస్థానం సిట్​ ఏర్పాటు చేసి, నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement