టీ షర్టు.. లెగ్గింగ్‌లు వద్దు

Tamil Nadu government advises its staff to avoid casual attire - Sakshi

ప్రభుత్వ ఉద్యోగుల డ్రెస్‌కోడ్‌పై తమిళనాడు ఆదేశం

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రభుత్వ ఉద్యోగులు హుందాగా ఉండే సంప్రదాయ డ్రెస్‌కోడ్‌ పాటించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా సచివాలయ మహిళా ఉద్యోగులు ధరించాల్సిన దుస్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్‌ జీవో జారీ చేశారు. మహిళా ఉద్యోగులు ఇకపై చీర, సల్వార్‌ కమీజ్, చుడీదార్‌లను మాత్రమే ధరించి విధులకు హాజరు కావాలని కోరింది. చీర మినహా మిగిలిన అన్ని డ్రస్సులను విధిగా దుపట్టాతో ధరించాలని స్పష్టం చేసింది. దుస్తుల రంగులు సైతం సున్నితమైనవిగా ఉండాలని తెలిపింది. అలాగే పురుషులు ప్యాంటు, షర్టు ధరించి రావాలి. అలాగే, రంగు రంగుల టీ షర్టులు ధరించరాదని పేర్కొంది. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top