అసెంబ్లీలో మొబైల్స్ స్విచాఫ్..! | Switch off mobile phones before entering House: Bihar Speaker | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో మొబైల్స్ స్విచాఫ్..!

Dec 4 2015 5:45 PM | Updated on Jul 18 2019 2:17 PM

అసెంబ్లీలో మొబైల్స్ స్విచాఫ్..! - Sakshi

అసెంబ్లీలో మొబైల్స్ స్విచాఫ్..!

బిహార్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మొబైల్ ఫోన్లు వాడటంపై స్పీకర్ విజయ్ చౌదరి ఆంక్షలు విధించారు.

పట్నా: బిహార్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మొబైల్ ఫోన్లు వాడటంపై స్పీకర్ విజయ్ చౌదరి ఆంక్షలు విధించారు. సభ్యులు అసెంబ్లీలోకి వచ్చే ముందుగా తమ మొబైల్స్ను స్విచాఫ్ చేసుకోవాలని ఆదేశించారు.

'అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు కొందరు సభ్యులు మొబైల్ ఫోన్లు వాడటం చూశా. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలోనూ సభ్యులు మొబైల్స్ వాడటం కనిపించింది. ఇది మంచి పద్ధతి కాదు. ఇలాంటి సంఘటనలు సభ గౌరవానికి విరుద్ధం. సభ్యులు తమ మొబైల్ ఫోన్లు ఉంచడానికి సభ వెలుపల ఏర్పాట్లు చేస్తాం. లేదంటే ఎమ్మెల్యేలు సభలోకి వచ్చే ముందు తమ మొబైల్స్ స్విచాఫ్ చేసుకుని తీసుకురావాలి' అని సభలో విజయ్ చౌదరి చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement