అత్యంత స్వచ్ఛ నగరంగా ఇండోర్‌

Swachh survekshan 2019 Indore Cleanest City In India Third Time - Sakshi

వరుసగా మూడోసారి అవార్డు సొంతం

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత స్వచ్ఛ నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఇండోర్‌ ఈ అవార్డును సొంతం చేసుకుంది. 2019 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను బుధవారం ఇక్కడ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రదానం చేశారు. ఈ అవార్డుల జాబితాలో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్, కర్ణాటకలోని మైసూర్‌ స్థానం సంపాదించాయి. ఈ సందర్భంగా స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ ర్యాంకులు పొందిన రాష్ట్రాలకు మహాత్మా గాంధీ మెమొంటోను ప్రదానం చేశారు. ‘పరిశుభ్రతను ఉద్యమంగా వ్యాప్తి చేయడంలో మహాత్మా గాంధీ క్రియాశీలకంగా వ్యవహించారు. ఇటీవల ముగిసిన కుంభమేళాలో నిర్వహించిన పారిశుద్ధ్య కార్యక్రమాల నుంచి ప్రజలు పరిశుభ్రత పట్ల ప్రేరణ పొందుతారని ఆశిస్తున్నా’అని కోవింద్‌ పేర్కొన్నారు. దీనిపై అవగాహన పెంపొందించడానికి పాఠశాలల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో పరిశుభ్రతను పాఠ్యాంశంగా చేర్చాలని సూచించారు.  

అవార్డుల వివరాలు

  • ఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఏరియాకు ‘స్వచ్ఛమైన చిన్న నగరం’అవార్డు  
  • ‘ఉత్తమ గంగా పట్టణం’గా ఉత్తరాఖండ్‌లోని గౌచర్‌  
  • అహ్మదాబాద్‌కు ‘స్వచ్ఛమైన పెద్ద నగరం’అవార్డు
  • వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద నగరంగా రాయ్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్‌)
  • ‘మధ్య స్థాయి స్వచ్ఛమైన నగరం’గా మధుర (ఉత్తర ప్రదేశ్‌)
  • వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్యస్థాయి నగరంగా బృందవాన్‌ (యూపీ)
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top