రాజ్యసభ సభ్యునిగా సురేష్ ప్రభు ప్రమాణం | Suresh Prabhu takes oath in Rajya Sabha | Sakshi
Sakshi News home page

రాజ్యసభ సభ్యునిగా సురేష్ ప్రభు ప్రమాణం

Dec 5 2014 7:38 PM | Updated on May 24 2018 2:09 PM

హరియానా నుంచి రాజ్యసభకు ఎన్నికైన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు.

న్యూఢిల్లీ: హర్యానా నుంచి రాజ్యసభకు ఎన్నికైన రైల్వే మంత్రి సురేశ్ ప్రభు శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని దైవ సాక్షిగా హిందీలో ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీతో పాటు వివిధ పార్టీల నేతలు ఆయనను అభినందించారు. సురేశ్ ప్రభు ఇటీవలే శివసేన నుంచి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

 

శివసేనను విడిచి వెళ్లిపో్యిన సురేష్ ప్రభు బీజేపీలో చేరడంతో ఆ అంశం ఆ రెండు పార్టీల మధ్య చిచ్చురేపింది. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వానికి శివసేన మద్దతు తెలపడంతో వారి మధ్య చోటు చేసుకున్న విభేదాలు కొలిక్కి వచ్చాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement