'సబ్ కీ సాత్..సబ్ కీ వికాస్' నినాదంతోనే ప్రచారం | 'subki saath..sabka vikas' is my slogan, kiran bedi | Sakshi
Sakshi News home page

'సబ్ కీ సాత్..సబ్ కీ వికాస్' నినాదంతోనే ప్రచారం

Jan 26 2015 6:15 PM | Updated on Aug 14 2018 4:34 PM

'సబ్ కీ సాత్..సబ్ కీ వికాస్' నినాదంతోనే ప్రచారం - Sakshi

'సబ్ కీ సాత్..సబ్ కీ వికాస్' నినాదంతోనే ప్రచారం

మహిళల భద్రత, యువతకు ఉపాధి కల్పన, పేదలకు సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ తెలిపారు.

న్యూఢిల్లీ: మహిళల భద్రత, యువతకు ఉపాధి కల్పన, పేదలకు సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని బీజేపీ ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి
కిరణ్ బేడీ తెలిపారు. సోమవారం  సాక్షి టీవీకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.  అనైతిక పద్ధతిలో కేజ్రీవాల్ ప్రచారం సాగుతోందన్నారు. తన అనుమతి లేకుండా తన ఫొటోతో దుష్ప్రచారం చేస్తున్నారని బేడీ ప్రత్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏర్పాటయ్యే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలుంటేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమౌతుందని అభిప్రాయ పడ్డారు. ప్రధాని ఇచ్చిన 'సబ్ కీ సాత్..సబ్ కా వికాస్' నినాదాన్ని కేంద్ర బిందువుగా చేసుకొని తన ప్రచారాన్ని నిర్వహిస్తున్నానని కిరణ్ బేడీ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement