యోగి చెక్‌ బౌన్స్‌.. ఫైన్‌ కట్టిన విద్యార్థి..

Student Pays Fine After Cheque Given By CM Yogi Adityanath Bounced - Sakshi

లక్నో, ఉత్తరప్రదేశ్‌ : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ చేతుల మీదుగా క్యాష్‌ అవార్డు అందుకున్న ఓ విద్యార్థి ఆనందం అంతలోనే ఆవిరయ్యింది. ఉత్తరప్రదేశ్‌ 10 వ తరగతి బోర్డు పరీక్షల్లో అలోక్‌ మిశ్రా అనే విద్యార్థి ఏడో ర్యాంకు సాధించారు. దీంతో అతనికి సీఎం యోగి లక్ష రూపాయల క్యాష్‌ అవార్డును చెక్‌ రూపంలో ఇచ్చారు. సీఎం ఇచ్చిన డబ్బును అందుకున్న అలోక్‌ డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళ్లారు.

బ్యాంకు అధికారులు చెక్‌ బౌన్స్‌ అయిందని, బదులుగా జరిమానా కట్టాలని చెప్పడంతో షాక్‌కు గురయ్యారు అలోక్‌. చెక్‌లో సంతకాలు సరిపోలలేదని అందుకే తిరస్కరించినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో అలోక్‌ పెనాల్టీ చెల్లించాల్సివచ్చింది. ఈ ఘటపై స్పందించిన డీఐఓఎస్‌ అలోక్‌కు కొత్త చెక్‌ను ఇచ్చినట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top