
అవసరమైతే కఠినంగా వ్యవహరిస్తా
మృదు స్వభావిగా, నిదానస్తురాలిగా పేరొంది అందరూ ఎంతో ప్రేమతో ‘అక్క’ అని పిలుచుకునే లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు.
లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్
న్యూఢిల్లీ: మృదు స్వభావిగా, నిదానస్తురాలిగా పేరొంది అందరూ ఎంతో ప్రేమతో ‘అక్క’ అని పిలుచుకునే లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభలో కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు. తాను ఎంత మృదు స్వభావినైనప్పటికీ సభ అవసరాల దృష్ట్యా సభ్యులను నియంత్రించాల్సి వచ్చినప్పుడు కఠినంగా వ్యవహరించడంలో తటపటాయించబోనని పీటీఐతో పేర్కొన్నారు. ‘సభ్యులతో నా వ్యవహార శైలి సాధారణంగానే ఉంటుంది.
అయితే, సభ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చర్చలు సజావుగా సాగేందుకు అవసరమైతే కఠినంగా వ్యవహరించేందుకు వెనుకాడబోను’ అని ఆమె చెప్పారు. సభా వ్యవహారాలకు ఆటంకం కలిగించే ఎంపీలకు ముకుతాడు వేసేందుకు నిబంధనలను రూపొందిస్తారా అన్న ప్రశ్నకు.. అవసరమైతే కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసుకోవచ్చని, సభ్యులకు వారి బాధ్యతలను పూర్తిగా తెలియజేయడమే ప్రధాన అంశమని పేర్కొన్నారు.