
సోహా అలీఖాన్ -కునాల్ ఖేము
అలనాటీ బాలీవుడ్ హీరోయిన్ షర్మిలా ఠాగూర్ కుమార్తె, సైఫ్ అలీఖాన్ చెల్లెలు బాలీవుడ్ నటి సోహా అలీఖాన్, తన బాయ్ ఫ్రండ్, బాలీవుడ్ హీరో కునాల్ ఖేము త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.
ముంబై : ఈ నెల 25న ఆదివారం తాను నటుడు కునాల్ ఖేమును నిరాడంబరంగా పెళ్లి చేసుకుంటున్నట్లు బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ చెప్పారు. ఖార్‌లోని నివాసంలో కొద్ది మంది అతిథుల మధ్య సాదాసీదాగా తమ వివాహం జరుగుతుందని అన్నారు. పెళ్లిరోజు ఎటువంటి దుస్తులు ధరించాలో ఇంకా తేల్చుకోలేదని 36 ఏళ్ల వధువు అన్నారు.
ఈ పెళ్లి వేడుక తనకు చిరస్మరణీయమైనదిగా, ప్రత్యేకమైనదిగా ఉండాలని కోరుకుంటున్నట్లు సోహా చెప్పారు. సోదరుడు సైఫ్ అలీఖాన్‌ను పెళ్లి చేసుకున్నప్పుడు కరీనాకపూర్ ధరించిన తమ కుటుంబ సాంప్రదాయ దస్తులను ఎందుకు ధరించడం లేదని ప్రశ్నించగా, అవి తమ నాయనమ్మవని చెప్పారు. వాటిని ఆమె తన కోడులు (సోహా తల్లి షర్మిల)కు ఇచ్చిందని, ఆమె తనకు కాబోయే కోడలు (కరీనా)కు ఇచ్చిందని అన్నారు. సోహా, కునాల్‌ల నిశ్చితార్థం గత ఏడాది పారిస్‌లో జరిగింది. కునాల్ సోహాకన్నా ఐదేళ్లు చిన్నవాడు. వీరిద్దరూ ‘99’అనే చిత్రంలో కలిసి నటించారు. ఈ వివాహం పట్ల తాను సంతోషంగా ఉన్నానని, షర్మిల చెప్పారు.