పోలీస్ పహారాలో 'శోభన్బాబు' | Sobhan Babu Statue Controversy: Tamil Group demands | Sakshi
Sakshi News home page

పోలీస్ పహారాలో 'శోభన్బాబు'

Jun 16 2015 9:02 AM | Updated on Sep 3 2017 3:47 AM

పోలీస్ పహారాలో 'శోభన్బాబు'

పోలీస్ పహారాలో 'శోభన్బాబు'

చెన్నైలోని తెలుగు సినీ నటుడు దివంగత శోభన్‌బాబు విగ్రహం తొలగించాలని తమిళగ మున్నేట్ర దళం(టీఎండీ) ఆందోళనకు

 చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నైలోని తెలుగు సినీ  నటుడు దివంగత శోభన్‌బాబు విగ్రహం తొలగించాలని తమిళగ  మున్నేట్ర దళం(టీఎండీ) ఆందోళనకు పిలుపు నివ్వడంతో సోమవారం ఆ విగ్రహానికి పోలీసులు రక్షణ కల్పించారు. ముం దు జాగ్రత్తగా టీఎండీ కార్యదర్శి కె. వీరలక్ష్మి ఇతర కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. శోభన్‌బాబు మరణించిన తరువాత చెన్నై మెహతానగర్ నెల్సన్ మాణిక్యం రోడ్డు మలుపులో ఆయన విగ్రహం నెలకొల్పారు.

 ఆయన ఇంటికి ఎదురుగా వారి సొంత స్థలంలో కుటుంబ సభ్యులే 2008లో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. విగ్రహ పీఠాన్ని పుట్‌పాత్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించారని 2012లో కొంత వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో శోభన్‌బాబు విగ్రహాన్ని తొలగించాలనే డిమాండ్‌పై ఆందోళన చేయనున్నట్లు టీఎండీ ప్రకటించింది. 

 

ఈ నేపథ్యంలో శోభన్ బాబు విగ్రహాన్ని తొలగించాలనే డిమాండ్ చేస్తూ సోమవారం ఆందోళన చేయబోతున్నట్లు తమిళగ మున్నేట్ర దళం కార్యదర్శి కే వీరలక్ష్మి ప్రకటించారు. ఈ మేరకు నిన్న స్థానికులు విగ్రహం వద్ద గుమికూడి ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు శోభన్ బాబు విగ్రహానికి రక్షణగా చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్త చర్యగా వీరలక్ష్మిని, తోటి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా  ఈ విషయంలో శోభన్‌బాబు కుమారుడు కరుణశేషుకు తెలుగు సంఘాలు అండగా నిలిచాయి. తెలుగు ప్రముఖులు రంగనాయకులు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, సూర్యప్రకాశరావు, తంగుటూరి రామకృష్ణ కరుణశేషును కలసి సంఘీభావం తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement