రాజస్తాన్‌ సీఎంకు ఏచూరి లేఖ

Sitaram Yechury Writes Letter To Rajasthan CM Ashok Gehlot - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సీపీఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోట్‌కు లేఖ రాశారు. రాజస్తాన్‌ పోలీసులు సీపీఎం కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఓ ఘటనపై విచారణ నిమిత్తం ఏలాంటి సమాచారం లేకుండా తమ పార్టీ మాజీ ఎమ్మెల్యేని, ఇద్దరు కార్యకర్తలను రాజస్తాన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారని, ఇది  పూర్తిగా చట్టవ్యతిరేకమని ఆయన లేఖలో పేర్కొన్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న తమ కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

అంతేకాకుండా పై అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే తమ పార్టీ కార్యాలయంలోకి పోలీసులు అక్రమంగా ప్రవేశించారని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు. ఈ ఘటనపై శాంతియుతతంగా ధర్నా నిర్వహిస్తున్న మహిళా కార్యకర్తలపై కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని సీఎంకు తెలియజేశారు. ఈ ఘటనకు పాల్పడ్డ పోలీసులను వెంటనే విధుల నుంచి తొలగించాలని గెహ్లోట్‌కు విజ‍్క్షప్తి చేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top