సిమి ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ | Shivraj Singh Chouhan orders judicial probe into Bhopal jail break, encounter | Sakshi
Sakshi News home page

సిమి ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ

Nov 4 2016 10:20 AM | Updated on Sep 4 2017 7:11 PM

సిమి ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ

సిమి ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ

సిమీ ఉగ్రవాదుల ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ న్యాయ విచారణకు ఆదేశించారు

భోపాల్: మధ్యప్రదేశ్‌లోని జైలు నుంచి తప్పించుకున్న ఎన్‌కౌంటర్‌కు గురైన సిమి ఉగ్రవాదుల ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ న్యాయ విచారణకు ఆదేశించారు. రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి జస్టీస్ ఎస్‌కే పాండే ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరుగుతుందని గురువారం రాత్రి వెల్లడించిన అధికారిక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

విచారణ ఖైదీలుగా ఉన్న సిమి ఉగ్రవాదులు అక్టోబర్ 30 రాత్రి ఓ హెడ్ కానిస్టేబుల్‌ను చంపి భోపాల్ సెంట్రల్ జైలు నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఎనిమిది మంది ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారు. ఈ ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మధ్యప్రదేశ్ హైకోర్టులో ఈ ఘటనపై న్యాయ విచారణ జరగాలన్న డిమాండ్‌తో గురువారం పిల్ కూడా వేశారు. ఈ నేపథ్యంలోనే ఎస్‌కే పాండే ఆధ్వర్యంలో న్యాయవిచారణకు ఆదేశిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఉగ్రవాదులు జైలు నుంచి పారిపోవడం, అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్ అంశాలపై పూర్తిస్థాయిలో న్యాయ విచారణ జరుగుతుందని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement