మందిర నిర్మాణానికి షియా బోర్డు భారీ విరాళం

Shia Central Waqf Board chairman Wasim Rizvi Donate To Ayodhya Temple - Sakshi

లక్నో: అయోధ్య వివాదం ముగిసి పోయిన నేపథ్యంలో రామమందిర నిర్మాణానికి సర్వం సిద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటిస్తున్నారు. రామ మందిర నిర్మాణానికి తామూ చేయూతనిస్తామని ఉత్తరప్రదేశ్‌ షియా సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు ముందుకొచ్చింది. మందిర నిర్మాణం కొరకు రూ.51000 విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు షియా సెంట్రల్‌ బోర్డు చీఫ్‌ వసీం రిజ్వీ శుక్రవారం తెలిపారు. రామ మందిర నిర్మాణానికి తాము అనుకూలమని అన్నారు.

కాగా వివాదాస్పద రామ మందిర- బాబ్రీ మసీదు భూమిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. వివాదాస్పద భూమిని మందిర నిర్మాణానికి కేటాయించి, మసీదుకు ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో దశాబ్దాలుగా హిందూ సంఘాలు చేస్తున్న మందిర నిర్మాణ ప్రయత్నానికి ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. దీంతో నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. త్వరలోకే కేంద్ర ప్రభుత్వ అయోధ్య ట్రస్ట్‌నూ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఇప్పటికే చర్యలు, సంప్రదింపులను ప్రారంభించింది.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top