కేబుల్‌కార్‌ కూలి ఏడుగురి దుర్మరణం | Seven members dies while fall down cable car | Sakshi
Sakshi News home page

కేబుల్‌కార్‌ కూలి ఏడుగురి దుర్మరణం

Jun 26 2017 2:15 AM | Updated on Sep 5 2017 2:27 PM

బారాముల్లా జిల్లాలో గుల్మార్గ్‌లో ఓ కేబుల్‌కార్‌ ఆదివారం కుప్పకూలడంతో ఏడు గురు దుర్మరణం పాలయ్యారు.

శ్రీనగర్‌: బారాముల్లా జిల్లాలో గుల్మార్గ్‌లో ఓ కేబుల్‌కార్‌ ఆదివారం కుప్పకూలడంతో ఏడు గురు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురితో పాటు ముగ్గురు గైడ్లు ఉన్నారు. బలమైన గాలులకు ఓ చెట్టు మీద పడడంతో రోప్‌వే తెగిపోయి ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలి పారు.

మృతుల్ని ఢిల్లీకి చెందిన జయంత్‌ అంద్రస్కర్, ఆయన భార్య మనీశా అం ద్రస్కర్, కుమార్తెలు అన్ఘా, జహ్నవిలుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ముక్తార్‌ అహ్మద్, జహంగీర్‌ అహ్మద్, ఫరూక్‌ అహ్మద్‌ అనే ముగ్గురు స్థానిక టూరిస్టు గైడ్లు దుర్మరణం చెందారు. గాయపడ్డ మరో ఇద్దరిని అధికారులు శ్రీనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement