ఏడు పడగల పాము పొరకు జనం పూజలు 

Seven Headed Snake Skin Found In Karnataka - Sakshi

రామనగరలో ఆలస్యంగా వెలుగు చూసిన వైనం 

దొడ్డబళ్లాపురం : ఏడు పడగల పాము గురించి మనం సాధారణంగా సినిమాల్లో చూస్తాం లేదంటే కథల్లో వింటుంటాం..నిజానికి ఏడుపడగల పాము ఉందా. అంటే లేదు అని ఖచ్చితంగా చెప్పలేము..ఉందా? అంటే ఉందని సాక్ష్యాలూ చూపలేము..అది నమ్మిన వారికి నిజం, నమ్మనివారికి కట్టుకథ... ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటారా.. రామనగర జిల్లా కనకపుర తాలూకా కోడిహళ్లి గ్రామం సమీపంలో ఏడుపడగల పాముకు చెందినదిగా చెప్పబడుతున్న పాము పొరకు జనం సాక్ష్యాత్‌ నాగదేవతగా భావించి పూజలు చేసేస్తున్నారు.

గత మూడు రోజుల క్రితం గ్రామం సమీపంలో స్థానికులకు కనిపించిన పాము పొర ఏడు పడగలను కలిగి ఉంది. దీంతో సమాచారం అందుకున్న గ్రామస్తులు అదో మహత్యంగా భావించి పూజలు ప్రారంభించారు. సమీపంలోనే పాము పుట్ట కూడా ఉండడంతో జనం నమ్మకాలకు ఊతమిచ్చినట్టయింది. విషయం కాస్త పక్క గ్రామాలకూ తెలిసి జనం తండోపతండాలుగా తరలివచ్చి పూజలు చేస్తున్నారు. 6 నెలల క్రితం దగ్గరలోని కోటెకొప్పఅనే గ్రామం నివాసి దొడ్డకెంపేగౌడ అనే వ్యక్తికి ఏడుపడగల పాము కనిపించినట్టు చెప్పుకున్నాడు. అప్పుడు దగ్గరలో పనిచేస్తున్న కొందరితో ఏడుపడగల పాము పోతోంది చూద్దురు రండి అంటూ పిలిచాడట. అయితే అప్పుడు పాము కనిపించలేదట. ఇప్పుడు వారి నమ్మకాలను బలపరిచేలా ఏడుపడగలు గల పాము పొర కనిపించడంతో జనం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని పూజలు చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top