
మహారాష్ట్రలో ఐఏఎస్ అధికారి అరెస్ట్
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి తన వయసును కూడా మరచి చిన్నారులపై నీచపు పనికి ఒడిగట్టిన సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.
పుణే: బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి తన వయసును కూడా మరచి చిన్నారులపై నీచపు పనికి ఒడిగట్టిన సంఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యవసాయ విద్య, పరిశోధన మండలి డెరైక్టర్ జనరల్‌గా ఉన్న 58 ఏళ్ల ఎం.హెచ్ సావంత్ పుణేలో నివాసం ఉంటున్నాడు. ఓ పాఠశాల పక్కనే అపార్ట్‌మెంట్‌లో ఉండే తన మామ ఇంటికి తరచూ వచ్చే సావంత్ అక్కడి మైదానంలో ఆడుకునే బాలికలపై కన్నేశాడు. వారికి చాక్లెట్లు, డబ్బు ఎరచూపి మాయమాటలతో వారి దగ్గరకు చేరి పదేళ్లలోపు వయసున్న నలుగురు బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
వారిపై అఘాయిత్యానికి ఒడిగట్టేముందు తన కంప్యూటర్‌లో అశ్లీల చిత్రాలను చూపించేవాడు. ఈ విషయాన్ని పిల్లలు ఇటీవలే తమ స్కూల్ టీచర్‌కు తెలపడంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం సావంత్‌ను అరెస్టు చేశారు. కోర్టు ఈనెల 30 వరకు ఆయనకు పోలీసు కస్టడీ విధించింది.