ఓవైసీ పై రాజ్యద్రోహం కేసు నమోదు | Sedition case against AIMIM chief​ Owaisi for his legal help remarks | Sakshi
Sakshi News home page

ఓవైసీ పై రాజ్యద్రోహం కేసు నమోదు

Jul 16 2016 9:55 AM | Updated on Sep 4 2017 5:01 AM

మజ్లిస్ ఇత్తెహాదులు ముస్లిమీన్ (ఎంఐఎం) అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై దేశ ద్రోహం కేసు నమోదైంది.

హైదరాబాద్: మజ్లిస్ ఇత్తెహాదులు ముస్లిమీన్ (ఎంఐఎం) అధినేత,   హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీపై దేశ ద్రోహం  కేసు నమోదైంది. 11 వ మెట్రోపాలిటన్ కోర్టు ఆదేశాల మేరకు ఐపీసీ సెక్షన్ 124(ఎ) ప్రకారం రాజ్యద్రోహం కేసును నమోదు చేసినట్టు ఎల్బీ నగర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు.

హైదరాబాద్ లో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసిన ఉగ్రవాదులకు న్యాయ సహాయం అందిస్తామని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. ఉగ్రవాదులను సమర్థిస్తూ మాట్లాడిన  ఓవైసీ పై చర్యలు తీసుకోవాలని కరుణా సాగర్ అనే లాయర్ న్యాయస్థానంలో  ప్రైవేట్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు ఓవైసీపై కేసు నమోదుకు పోలీసులను ఆదేశించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement