బీజేపీ రెండో విడత జాబితా విడుదల

The Second List Of The BJP Candidates Is Released On Friday - Sakshi

న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల పేర్లతో బీజేపీ మరో జాబితా విడుదల చేసింది. రెండో విడత జాబితాలో 28 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. నాలుగు రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ శుక్రవారం సమావేశం అయింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అధ్యక్షతన సమావేశం ఏర్పాటు అయింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, అరుణ్‌ జైట్లీ, సుష్మాస్వరాజ్‌తో పాటు పలువురు అగ్రనాయకులు పాల్గొన్నారు. (బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా)

తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేశారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసే 177 మంది, మిజోరంకు పోటీ చేసే 24 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఈ మేరకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సెక్రటరీ జేపీ నడ్డా లేఖ విడుదల చేశారు.

రెండో విడత అభ్యర్థుల జాబితా

సంఖ్య నియోజకవర్గం అభ్యర్థి పేరు
1 ఆసిఫాబాద్‌(ఎస్టీ) అజ్మీరా ఆత్మారాం నాయక్‌
2 ఖానాపూర్‌(ఎస్టీ) సాట్ల అశోక్‌
3 నిర్మల్‌ డాక్టర్‌ ఐండ్ల సువర్ణా రెడ్డి
4 నిజామాబాద్‌ అర్బన్‌ యెండల లక్ష్మీనారాయణ
5 సిర్పూర్‌ డాక్టర్‌ శ్రీనివాసులు
6 జగిత్యాల మూడుగంటి రవీందర్‌ రెడ్డి
7 రామగుండం బల్మూరి వనిత
8 సిరిసిల్ల మల్లాగారి నర్సాగౌడ్‌
9 కూకట్‌ పల్లి మాధవరం కాంతా రావు
10 సిద్ధిపేట నైని నరోత్తం రెడ్డి
11 రాజేంద్రనగర్‌  బద్దం బాల్‌ రెడ్డి
12 శేరిలింగం పల్లి జి. యోగానంద్‌
13 మలక్‌ పేట్‌ ఆలె జితేంద్ర
14 చార్మినార్‌ టి. ఉమా మహేంద్ర
15 చాంద్రాయణగుట్ట సయ్యద్‌ షాహజాదీ
16 యాకుత్‌పురా చర్మాని రూప్‌రాజ్‌
17 బహదూర్‌పురా హనీఫ్‌ అలీ
18 దేవరకొండ అగ్గని నర్సింహులు సాగర్‌
19 వనపర్తి కొత్త అమరేందర్‌ రెడ్డి
20 నాగర్‌ కర్నూల్‌ నేదనూరి దిలిప్‌ చారి
21 నాగార్జున్‌ సాగర్‌ కంకనాల నివేదిత
22 ఆలేరు దొంతిరి శ్రీధర్‌ రెడ్డి
23 స్టేషన్‌ ఘన్‌పూర్‌(ఎస్సీ) పెరుమాండ్ల వెంకటేశ్వర్లు
24 వరంగల్‌ వెస్ట్‌ ఎం ధర్మారావు
25 వర్ధన్నపేట(ఎస్సీ) కొంత సారంగ రావు
26 ఇల్లెందు(ఎస్టీ) మోకాళ్ల నాగ స్రవంతి
27 వైరా(ఎస్టీ) భూక్యా రేష్మా భాయి
28 అశ్వారావు పేట డాక్టర్‌ భూక్యా ప్రసాద రావు
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top