'ఆ రైల్లో వెళ్లాను.. కానీ ఆమెను వేధించలేదు' | Sarfaraz Alam Admits He Was Travelling In Train: Police | Sakshi
Sakshi News home page

'ఆ రైల్లో వెళ్లాను.. కానీ ఆమెను వేధించలేదు'

Jan 24 2016 11:48 AM | Updated on Sep 3 2017 4:15 PM

'ఆ రైల్లో వెళ్లాను.. కానీ ఆమెను వేధించలేదు'

'ఆ రైల్లో వెళ్లాను.. కానీ ఆమెను వేధించలేదు'

ఈ నెల 17న డిబ్రుగడ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన మాట వాస్తవమేనని, అయితే మహిళను తాను వేధించలేదని బిహార్ అధికార జేడీయూ ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలం పోలీసులకు చెప్పారు.

పట్నా: ఈ నెల 17న డిబ్రుగడ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్లో ప్రయాణించిన మాట వాస్తవమేనని, అయితే మహిళను తాను వేధించలేదని బిహార్ అధికార జేడీయూ ఎమ్మెల్యే సర్ఫరాజ్ ఆలం పోలీసులకు చెప్పారు. కాగా ఇంతకుముందు తాను ఆ రైలులో ప్రయాణించలేదని చెప్పిన ఎమ్మెల్యే ఆ తర్వాత నిజం అంగీకరించారు.

17న డిబ్రుగడ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రయాణికురాలి పట్ల సర్ఫరాజ్ అసభ్యంగా ప్రవర్తించి వేధించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎమ్మెల్యే మద్యం మత్తులో ఉన్నారని బాధితురాలి భర్త చెప్పారు. రైలు పట్నాకు వెళ్లిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు ఎమ్మెల్యేను నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. ఆదివారం మరోసారి ఆయన్ను విచారించనున్నారు. జోకిహట్ నుంచి సర్ఫరాజ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement