సుప్రీంకోర్టులో రెంట్‌ పిటిషన్‌ తిరస్కరణ

Rejection Of Rent Petition In Supreme Court - Sakshi

న్యూఢిల్లీ: ఇంటి యజమానులు వారి ఇళ్లలో అద్దెకు ఉంటున్న విద్యార్థులు లేదా కూలీ పని వారు రెంట్‌ కట్టక పోతే ఖాళీ చేయించకుండా కేంద్రం సూచించేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ విచారణను జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కోర్టు అమలు చేయలేదని వ్యాఖ్యానించింది. పిటిషన్‌ను లాయర్‌ పవన్‌ ప్రకాశ్, ఏకే పాండే దాఖలు చేశారు.

లాక్‌డౌన్‌ పిటిషన్‌ తిరస్కరణ 
లాక్‌డౌన్‌లో ప్రభుత్వాధికారి ఇచ్చిన ఆదేశాలను పాటించకపోవడం వంటి కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లు ఐపీసీ సెక్షన్‌ కింద నమోదై ఉంటే వాటిని కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు కోర్టు తిరస్కరించింది. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపీసీ) సెక్షన్‌ 188 ప్రకారం ఏదైనా చర్య మానవ జీవితానికి హని కలిగిస్తే అతనికి రూ. 1000 జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష పడేఅవకాశం ఉంది. దీన్ని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది. అసలు ఎఫ్‌ఐఆర్‌ ఉండకూడదని కోరుకుంటున్నారా అని సీనియర్‌ లాయర్‌ గోపాల్‌ శంకరనారాయన్‌ను కోర్టు ప్రశ్నించింది. ఉత్తర ప్రదేశ్‌ మాజీ డీజీపీ విక్రమ్‌ సింగ్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top