రణరంగమైన మద్రాస్ ఐఐటీ | Protesters, police clash outside IIT Madras | Sakshi
Sakshi News home page

రణరంగమైన మద్రాస్ ఐఐటీ

Jun 2 2015 12:23 PM | Updated on Aug 21 2018 5:46 PM

రణరంగమైన మద్రాస్ ఐఐటీ - Sakshi

రణరంగమైన మద్రాస్ ఐఐటీ

విద్యార్ధి సంఘం గుర్తింపు రద్దు విషయంలో మంగళవారం నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగడంతో మంగళవారం మద్రాస్ ఐఐటీ రణరంగంగా మారింది.

మద్రాస్ ఐఐటీ ప్రాంగణం రణరంగంగా మారింది. విద్యార్ధి సంఘం గుర్తింపు రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును గర్హిస్తూ గత మూడు రోజులుగా విద్యార్థులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగడంతో పరిస్థితి ఉద్రింక్తంగా మారింది.

ఒక దశలో విద్యార్థులను పోలీసులు చితకబాదినట్లు సమాచారం. మీడియా ప్రతినిధులు క్యాపస్ లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటుండంతో ఆ అనుమానాలకు మరింత బలం చేకూరింది. ప్రధాని నరేంద్రమోదీని విమర్శించారన్న ఫిర్యాదు ఆధారంగా అంబేడ్కర్-పెరియార్ స్టడీ సర్కిల్(ఏపీఎస్‌సీ) విద్యార్థి సంఘం గుర్తింపును రద్దు  చేయడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement