‘మరో సిరియాగా మారనివ్వం’

Priority is to prevent Kashmir from turning into Syria: New interlocutor

సాక్షి, న్యూఢిల్లీ: యువత ఉగ్రవాదం వైపు ఆకర్షితులు కాకుండా.. పటిష్టమైన చర్యలు చేపట్టి ప్రశాంత కశ్మీర్‌ను రూపొందించడమే తన తక్షణ లక్ష్యమని నూతనంగా నియమించబడిన జమ్ము-కశ్మీర్‌ చర్చల ప్రత్యేక ప్రతినిధి దినేశ్వర్‌ శర్మ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి, అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు సేకరించి సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం లభించేలా చేస్తానని ఆయన అన్నారు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ.. ‘‘శాంతిని నెలకొల్పడమే మా తక్షణ కర్తవ్యం.

దాని కోసం అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకుంటాం. శాంతి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి ప్రతి ఒక్కరితో చర్చిస్తాం. తప్పుదోవ పట్టిన కశ్మీర్‌ యువతను చూస్తూంటే బాధేస్తోంది. హింసావాదంతో వినాశనం తప్ప మరేం లేదు. హింసకు సాధ్యమైనంత త్వరగా స్వస్తి పలకడమే మా లక్ష్యం. యువత తప్పుదోవ పడితే సమాజమే నాశనం అవుతుంది. ఇలా జరగడాన్ని మేము సహించం.. కశ్మీర్‌ను మరో సిరియాగా మారనివ్వం’’ అని అన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top