22 కిలోమీటర్ల ట్రంప్‌–మోదీ రోడ్‌షో

Preparations on for 22km Trump Modi Roadshow in Ahmedabad - Sakshi

అహ్మదాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీలు కలసి అహ్మదాబాద్‌లో చేయనున్న రోడ్‌షోకు పనులు చురుగ్గా సాగుతున్నాయి. దాదాపు 22 కిలోమీటర్ల పొడవున, 50 వేల మంది ప్రజలు దీనికి హాజరుకానున్నారని అహ్మదాబాద్‌ మేయర్‌ బిజాల్‌ పటేల్‌ చెప్పారు. ఈ రోడ్‌షో ద్వారా ట్రంప్‌–మోదీలు సబర్మతీ ఆశ్రమం చేరుకోనున్నారు. మహాత్మాగాంధీకి ఈ ప్రదేశంతో సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. అనంతరం ఇద్దరూ కలసి మొతెరాలో నిర్మించిన క్రికెట్‌ స్టేడియాన్ని చేరుకోనున్నారు. 22 కిలోమీటర్ల పొడవున ప్రజలు నిలబడే పెద్ద రోడ్‌షో ఇదే కావచ్చని బిజాల్‌ పటేల్‌ చెప్పారు. రోడ్‌షోలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు తమ సంప్రదాయ ఆహార్యంలో కనిపిస్తారని చెప్పారు. మోదీ–ట్రంప్‌లు కలసి మొతెరాలో బహిరంగ సభలో పాల్గొంటారు. (చదవండి: భారత సీఈఓలతో 25న ట్రంప్‌ భేటీ)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top