మహారాష్ట్రలో ఆధిక్యంలో ప్రముఖులు | Popular persons lead in election counting in maharashtra | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో ఆధిక్యంలో ప్రముఖులు

Oct 19 2014 9:51 AM | Updated on Oct 8 2018 6:02 PM

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాల్లో పలువురు ప్రముఖులు ఆధిక్యంలో ఉన్నారు.

హైదరాబాద్: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాల్లో పలువురు ప్రముఖులు ఆధిక్యంలో ఉన్నారు. పర్లీ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి నిలిచిన బీజేపీ అభ్యర్థి, గోపినాథ్ ముండే కుమార్తె పంకజాముండే ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. అలాగే  దక్షిణ కరాడ్లో మాజీ సీఎం పృధ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్), నాగ్పూర్లో దేవేంద్ర ఫడ్నవిస్ (బీజేపీ), బారమతిలో అజిత్ పవార్ (ఎన్సీపీ), కుడాల్లో మాజీ సీఎం నారాయణరావు రాణెతోపాటు మాజీ మంత్రులు ఆర్ఆర్ పాటిల్, ఛగన్ బుజబల్, అశోక్ చవాన్ భార్య అమృతా చవాన్ కూడా అధిక్యంలో  ఉన్నారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది.

ఎన్నికల ఓట్ల లెక్కింపులో వెనుకంజలో ఉన్న వారు:
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కుమారుడు రావూ షాహెబ్ షెకావత్
కేంద్ర మాజీ మంత్రి సుశీల్ కుమార్ షిండే కుమార్తె ప్రణీతి షిండే

Advertisement
 
Advertisement
Advertisement