తల్లి ఫోన్‌తో ఓ కొడుకు అసభ్య నిర్వాకం.. | police nab a person who sent lewd messages to 20 women | Sakshi
Sakshi News home page

తల్లి ఫోన్‌తో ఓ కొడుకు అసభ్య నిర్వాకం..

May 5 2017 11:28 AM | Updated on Jul 26 2018 5:23 PM

తల్లి ఫోన్‌తో ఓ కొడుకు అసభ్య నిర్వాకం.. - Sakshi

తల్లి ఫోన్‌తో ఓ కొడుకు అసభ్య నిర్వాకం..

తప్పుడు మార్గంలో 20మంది అమ్మాయిల ఫోన్‌ నెంబర్లు తెలుసుకొని వారికి అసభ్యకరమైన సందేశాలు, ఫొటోలు పంపిస్తున్న ఓ ప్రబుద్ధుడిని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ముంబయి: తప్పుడు మార్గంలో 20మంది అమ్మాయిల ఫోన్‌ నెంబర్లు తెలుసుకొని వారికి అసభ్యకరమైన సందేశాలు, ఫొటోలు పంపిస్తున్న ఓ ప్రబుద్ధుడిని ముంబయి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి పనులను తాను కొన్ని నెలలుగా చేస్తున్నానని స్వయంగా అంగీకరించాడు. వివరాల్లోకి వెళితే.. ముంబయిలో రోహణ్‌ డీ సౌజా అనే యువకుడు ఉన్నాడు.

అతడు తొలుత ఏ అమ్మాయిల ఫేస్‌బుక్‌ ప్రొఫెల్స్‌కు ఫోన్‌ నెంబర్లు జమ చేసి ఉన్నాయో చూసేవాడు. ఆ తర్వాత అతడి తల్లి ఫోన్‌ నుంచి సందేశాలు పంపిస్తూ వివరాలు తెలుసుకునేవాడు. అసభ్యకరమైన, ఇబ్బందికరమైన ప్రశ్నలు అడిగేవాడు. ఉదాహరణకు మీరు ఈ రోజు ఎలాంటి వస్త్రాలు వేసుకున్నారు? లాంటి ప్రశ్నలు వేసేవాడు. పోలీసులు ఈ కేసుపై స్పందిస్తూ తాను ఈ పని ఎప్పటి నుంచో చేస్తున్నట్లు నిందితుడు అంగీకరించాడని చెప్పారు. ఒక్కొక్కరికి ఒక్కో ప్రాంతంలో ఉండి అసభ్య సందేశాలు పంపించేవాడని తెలిపాడు. ఎట్టకేలకు అతడి నంబర్‌ ద్వారా బాంద్రాలోని మౌంట్‌ మేరి వద్ద అతడిని అరెస్టు చేసినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement