చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ | PIL filed in Supreme Court asking the Tamil Nadu Governor to invite VK Sasikala to form the government . | Sakshi
Sakshi News home page

చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్

Feb 13 2017 1:37 PM | Updated on Sep 2 2018 5:28 PM

చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ - Sakshi

చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వేగం పెంచారు. తనకు ఎమ్మెల్యేలందరి మద్దతు ఉందని చెబుతున్నా రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడంపట్ల ఇప్పటికే అసంతృప్తితో ఉన్న ఆమె ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వేగం పెంచారు. తన తరఫున సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయించారు. శశికళకు తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతున్నా, ఆమెను గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం లేదని, 24 గంటల్లోగా ఆమెను ఆహ్వానించేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. స్వయంగా శశికళ ఈ పిల్ దాఖలు చేయకపోయినా.. ఆమెకు మద్దతుగా ఇది దాఖలైనట్లు తెలుస్తోంది. 24గంటల్లోగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు శశికళను ఆహ్వానించేలా గవర్నర్‌ను ఆదేశించాలని న్యాయవాది పీఎల్‌ శర్మ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు.
 
మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా శశికళను ఆహ్వానించడం లేదని ఆయన తన పిటిషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోపక్క, శశికళ శిబిరానికి సంబంధించిన వివరాలను పోలీసులు మద్రాస్‌ హైకోర్టుకు సమర్పించారు. 119 మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగానే ఉన్నారని, వారినుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అందులో పేర్కొన్నారు. క్యాంపులో ఉంటున్నవారంతా కూడా స్వచ్ఛందంగా ఉంటున్నట్లు వారు చెప్పారని కోర్టుకు వివరించారు.

తమిళనాడు కథనాలు చదవండి...
 
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement