ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారిక నివాసం ఎదుట శుక్రవారం వయోవృద్ధులు, సామాజిక కార్యకర్త అరుణా రాయ్ ధర్నా నిర్వహించారు.
ప్రధాని మన్మోహన్ సింగ్ అధికారిక నివాసం ఎదుట శుక్రవారం వయోవృద్ధులు, సామాజిక కార్యకర్త అరుణా రాయ్ ధర్నా నిర్వహించారు. 7 రేసు కోర్సు రోడ్డులోని ప్రధాని నివాసానికి వెళ్లి పెన్షన్ పథకాన్నిపునరుద్ధరించాలంటూ డిమాండ్ చేశారు.
పోలీసులు నిరసన కారుల్ని అదుపులోకి తీసుకుని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బాబా ఆధావ్, ఆరుణా రాయ్ సారథ్యంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి జైరాం రమేష్ సహా ఇతర నాయకుల్ని కలసినట్టు అరుణా రాయ్ తెలిపారు. ప్రతి నెల తగినంత భృతి అందేలా వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని అమలు చేయాలని కోరారు.