రైల్వేశాఖ యూ టర్న్‌

Over 100 Per Cent Occupancy On Bullet Train Route - Sakshi

సాక్షి, ముంబై : బుల్లెట్‌ ట్రయిన్‌ విషయంలో రైల్వే శాఖ యూ టర్న్‌ తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌గా చెప్పుకునే బుల్లెట్‌ ట్రయిన్‌ అంత లాభదాయం కాదని పేర్కొన్న రైల్వ శాఖ తాజాగా మాట మార్చింది. భారత్‌లో పరుగులు తీయనున్న మొదటి బుల్లెట్‌ ట్రయిన్‌  పూర్తిగా పూర్తిగా లాభదాయకమని రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. ఆఫ్‌ సీజన్‌లోనూ బుల్లెట్‌ ట్రయిన్‌కు నష్టాలు వచ్చే అవకాశం తక్కువని ఆయన తెలిపారు.

ముంబై-అహ్మదాబాద్‌ మధ్య నడిచే బుల్లెట్‌ ట్రయిన్‌ 100 శాతం ఆకుపెన్సీ కలిగి ఉండడమే కాక.. భారీగా లాభాలను గడిస్తుందని గోయల్‌ ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు. దేశంలోని మొదటి బుల్లెట్‌ ట్రయిన్‌ 2023న పట్టాలు ఎక్కనుంది. జులై నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలం‍లో ఈ ట్రయిన్‌కు సుమారు 30 కోట్ల రూపాయలు నష్టాలు వచ్చే అవకాశం ఉందని ఆర్టీఐ ద్వారా తెలిసిన సమాచారం. దీనిపై వశ్చిమ రైల్వే శాఖ వివరణ ఇస్తూ.. ముంబై-అహ్మదాబాద్‌ రూట్‌ అత్యుత్తమ వ్యాపార మార్గాల్లో ఒకటి తెలిపింది. ఆఫ్‌ సీజన్‌లోనే రైల్వే శాఖ ఈ రూట్‌లో 233 కోట్ల రూపాయలను ఆర్జిస్తోందని రైల్వే శాఖ పబ్లిక్‌ రిలేషన్‌ అధికారి రవీందర్‌ భాస్కర్‌ వెల్లడించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top