ఆర్మీ ర్యాలీలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి | online regestration compulsory to army rally | Sakshi
Sakshi News home page

ఆర్మీ ర్యాలీలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి

Jul 2 2015 8:59 AM | Updated on Sep 3 2017 4:45 AM

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలకు నిరుద్యోగులు పోటెత్తుతుండడంతో ఇకపై ఈ నియామకాలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్ణయించినట్లు సైన్యం ప్రకటించింది.

జలంధర్: ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలకు నిరుద్యోగులు పోటెత్తుతుండడంతో ఇకపై ఈ నియామకాలకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్ణయించినట్లు సైన్యం ప్రకటించింది. ఈ ర్యాలీలకు వచ్చే అభ్యర్థులు ముందుగా సైన్యానికి చెందిన రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్ joinindianarmy.nic.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సైనిక నియామకాల డీజీ లెఫ్ట్టినెంట్ జనరల్ ఆర్‌ఎన్ నాయర్ బుధవారం కపుర్తలలో తెలిపారు. ఆర్మీ ర్యాలీలకు అభ్యర్థులు పెద్ద ఎత్తున వస్తుండటంతో లాఠీచార్జి చేయాల్సి వస్తోందని, ఇబ్బందులను నివారించేందుకే ఈ పద్ధతిని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులనే పరిమిత సంఖ్యలో ఆయా తేదీల్లో నియామకాలకు పిలుస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement