'దేశం గొప్ప నాయకుణ్ని కోల్పోయింది' | odissa former cm jb patnaik died | Sakshi
Sakshi News home page

'దేశం గొప్ప నాయకుణ్ని కోల్పోయింది'

Apr 21 2015 9:13 AM | Updated on Sep 3 2017 12:38 AM

'దేశం గొప్ప నాయకుణ్ని కోల్పోయింది'

'దేశం గొప్ప నాయకుణ్ని కోల్పోయింది'

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ మృతి పట్ల తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ సంతాపం తెలిపారు.

తిరుపతి : ఒడిశా మాజీ ముఖ్యమంత్రి జేబీ పట్నాయక్ మృతి పట్ల తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ దేశం గొప్ప నాయకుణ్ని కోల్పోయిందని,  దేశ రాజకీయాల్లో జేబీ పట్నాయక్ కీలక పాత్ర పోషించారని అన్నారు.

కాగా గుండెపోటుతో తిరుపతి స్విమ్స్లో చికిత్స పొందుతూ జేబీ పట్నాయక్ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. జేబీ పట్నాయక్ మృతదేహం మరికాసేపట్లో సాంస్కృతిక విద్యాపీఠం వద్దకు తీసుకెళ్లి.. అనంతరం ప్రత్యేవ విమానంలో ఒడిశా రాజధాని భువనేశ్వర్కు తరలిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement