హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి.
న్యూ ఢిల్లీ: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యపై దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఎన్ఎస్యూఐ కార్యకర్తలు రోహిత్ మృతిని నిరసిస్తూ శుక్రవారం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. భారీగా గుమికూడిన విద్యార్థులను పోలీసులు చెదరగొట్టారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ఈ గలాటాలో ఓ విద్యార్థి సొమ్మసిల్లి పడిపోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.