ఒకప్పటి జనతా పరివార్ పార్టీల విలీన ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది.
పట్నా: ఒకప్పటి జనతా పరివార్ పార్టీల విలీన ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది. ఈ కూటమిలో కీలకమైన ఆర్జేడీ ఇప్పటికే విలీనానికి ఆమోదం తెలపగా, మరో ముఖ్యమైన పార్టీ జేడీయూ కూడా అధికారికంగా తన సమ్మతిని ప్రకటించింది.
బుధవారం రాత్రి బిహార్ సీఎం నితీశ్ కుమార్ నివాసంలో జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు పార్టీ అధినేత శరద్ యాదవ్, నితీశ్‌లకు బాధ్యతలు అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.