‘పీకే కథ నాదే.. రూ.కోటి ఇప్పించండి!’ | Now, Aamir Khan's 'PK' targeted in court, sued for Rs 1 cr | Sakshi
Sakshi News home page

‘పీకే కథ నాదే.. రూ.కోటి ఇప్పించండి!’

Jan 21 2015 1:43 PM | Updated on Sep 27 2018 8:55 PM

‘పీకే కథ నాదే.. రూ.కోటి ఇప్పించండి!’ - Sakshi

‘పీకే కథ నాదే.. రూ.కోటి ఇప్పించండి!’

ఆమీర్‌ఖాన్ నటించిన ‘పీకే’ సినిమాలోని కథ, సన్నివేశాలు తనవేనని, తన హిందీ నవల ‘ఫరిస్తా’

న్యూఢిల్లీ:  ఆమీర్‌ఖాన్ నటించిన ‘పీకే’  సినిమాలోని కథ, సన్నివేశాలు తనవేనని, తన హిందీ నవల ‘ఫరిస్తా’ నుంచి వాటిని కాపీ కొట్టారంటూ కపిల్ ఇసాపురి అనే రచయిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా నిర్మాత విధువినోద్ చోప్రా, దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ, స్క్రిప్టు రచయిత  జోషీలు తన నవలలోని పాత్రలు, 17 సన్నివేశాలను తెలివిగా కాపీకొట్టారని ఆరోపించారు.  తనకు ఆ సినిమా రచయితగా గుర్తింపునివ్వడంతో పాటు రూ. కోటి నష్ట పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. తాను నవలను 2009లో పూర్తి చేశానని, అది 2013లో ప్రచురితమైందని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement