'ప్రీతిజింటా ఎలాంటి షరతులు విధించలేదు' | Sakshi
Sakshi News home page

'ప్రీతిజింటా ఎలాంటి షరతులు విధించలేదు'

Published Fri, Sep 5 2014 3:39 PM

'ప్రీతిజింటా ఎలాంటి షరతులు విధించలేదు' - Sakshi

ముంబై: బాలీవుడ్ తార ప్రీతి జింటా ఐదు షరతులు పెట్టినట్టు మీడియాలో వస్తున్న వార్తలను వాడియా గ్రూప్ ఖండించింది. జూన్ లో పారిశ్రామికవేత్త నెస్ వాడియాపై దాఖలు చేసిన కేసును ఉపసంహరించుకోవడానికి ఐదు షరతులు పెట్టినట్టు వార్తలు వెలువడ్డాయి. మే 30 తేదిన వాంఖెడే స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా తనను లైంగికంగా వేధించారని ముంబైలోని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ లో ప్రీతి జింటా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 
 
'మీడియాలో వస్తున్న వార్తలన్ని ఊహాజనితమైనవి. వాటిలో వాస్తవం లేదు. ఇరువర్గాల మధ్య అలాంటి చర్చలు జరగలేదు' అని వాడియా గ్రూప్ వెల్లడించింది. అయితే ఆరోజున నెస్ వాడియా, ప్రీతిజింటాల మధ్య ఎలాంటి వివాద ఛాయలు కనిపించలేదని ఈకేసులో నలుగురు సాక్ష్యులు చెప్పినట్టు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement