మళ్లీ ఐసిస్‌ కలకలం.. రంగంలోకి ఎన్‌ఐఏ, 5గురు అరెస్టు!

New ISIS module, NIA raids 16 places in Delhi, UP, - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మరోసారి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌ కలకలం రేపుతోంది. ఐసిస్‌కు అనుకూలంగా "హర్కత్‌ ఉల్‌ అరబ్‌ ఏ ఇస్లాం" పేరిట ఓ ఉగ్ర విభాగం పనిచేస్తోందని తాజాగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గుర్తించింది. దీనికి సంబంధించి ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 16 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో రాష్ట్ర ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్‌)తో కలిసి సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు.. అమ్రోహ ప్రాంతంలో ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

అరెస్టైన నిందితుల్లో ఒకరిని స్థానిక మదర్సా నుంచి అదుపులోకి తీసుకోగా.. మిగతా వారిని అమ్రోహలోని ఇతర ప్రదేశాల్లో ఉండగా అరెస్టు చేశారు. కొత్త పేరుతో దేశంలో వీరు ఐసిస్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు భావిస్తున్న ఎన్‌ఐఏ అధికారులు.. వీరు దేశంలో విధ్వంసాలకు ఏమైనా కుట్ర పన్నారా? అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top