విద్యార్థులపై వేధింపులకు చర్యలు | NCERT has been introducing awareness among students in the country | Sakshi
Sakshi News home page

విద్యార్థులపై వేధింపులకు చర్యలు

Sep 18 2017 3:53 AM | Updated on Sep 19 2017 4:41 PM

దేశంలో విద్యార్థులపై వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో వారికి అవగాహన కల్పించేందుకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) నడుం బిగించింది.

న్యూఢిల్లీ: దేశంలో విద్యార్థులపై వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో వారికి అవగాహన కల్పించేందుకు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎన్‌సీఈఆర్‌టీ) నడుం బిగించింది. వచ్చే ఏడాది నుంచి అన్ని ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల చివర్లో విద్యార్థుల వేధింపుల నివారణకు మార్గదర్శకాలతో పాటు హెల్ప్‌లైన్‌ నంబర్లను ప్రచురించాలని నిర్ణయించింది. వెనుక కవర్‌ లోపల గుడ్‌ టచ్, బ్యాడ్‌ టచ్‌ మధ్య వ్యత్యాసాలను బొమ్మల రూపంలో ఇస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement