నౌకాదళ తేజస్‌ పరీక్ష సక్సెస్‌

Naval version of Tejas undergoes successful tests - Sakshi

బెంగళూరు / న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ నౌకాదళ వెర్షన్‌ను అధికారులు గురువారం విజయవంతంగా పరీక్షించారు. యుద్ధవాహక నౌక నుంచి టేకాఫ్‌ కావడం, ఆతర్వాత హుక్‌ వ్యవస్థ సాయంతో సురక్షితంగా ల్యాండ్‌ కావడం వంటి పరీక్షల్ని పూర్తిచేశారు. దీంతో ఈ సామర్థ్యం కలిగిన అమెరికా, రష్యా, చైనా, యూరప్‌ల సరసన భారత్‌ చేరింది. యుద్ధ విమానం నౌకపై దిగే సమయంలో దాని వేగాన్ని అదుపు చేయడానికి ఉండే ‘అరెస్టర్‌ హుక్‌ సిస్టమ్‌’ను కూడా ఈ సందర్భంగా విజయవంతంగా పరీక్షించారు. రాబోయే రోజుల్లో ల్యాండింగ్, ఇంధనం నింపే విషయంలో తేజస్‌కు మరిన్ని ట్రయల్స్‌ నిర్వహిస్తామని నేవీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారత వాయుసేన(ఐఏఎఫ్‌) ఇప్పటికే 40 తేజస్‌ యుద్ధ విమానాల కోసం హెచ్‌ఏఎల్‌కు ఆర్డర్‌ ఇచ్చారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top