మీడియాపై దాడులను అడ్డుకుందాం

National Sessions in tamilnadu for attacks on media

దాడుల అడ్డుకట్టకు ఐదు తీర్మానాలు

చెన్నైలో లీడ్‌ సదస్సు

కొరుక్కుపేట : మీడియాపై దాడులను అడ్డుకునేందుకు చెన్నైలో జాతీయ స్థాయి సదస్సు జరిగింది. ఇందులో దాడుల అడ్డుకట్టకు, మీడియా భద్రతకు ఐదు తీర్మానాలు చేశారు. వీటిని కేంద్రంతోపాటు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించనున్నారు.  ఫెడరేషన్‌ ఆఫ్‌ మీడియా ప్రొఫెషనల్‌ ఆధ్వర్యంలో చెన్నై వేదికగా లీడ్‌ పేరుతో మీడియాపై దాడులు– బెదిరింపులు – మీడియాలో నేటి పరిస్థితిపై జాతీయ సదస్సు ఆదివారం జరిగింది.

సదస్సు కోఆర్డినేటర్‌ సంధ్య రవిశంకర్‌ సంధానకర్తగా రెండు సెషన్‌లతో కార్యక్రమం జరిగింది. ఇందులో సాక్షి మీడియా తరఫున ఈడీ రామచంద్రమూర్తి, దేవులపల్లి అమర్, ది హిందూ చైర్మన్‌ ఎన్‌.రామ్, ఎడిటర్‌ ముకుంద్‌ పద్మనాభన్, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రెసిడెంట్‌ ఎడిటర్‌ అరుణ్‌ రామ్, నటి గౌతమి, తమిళనాడు తమిళ భాష అభివృద్ధి శాఖ మంత్రి ఎం.పాండియరాజన్, ఎన్‌డీ టీవీ సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రావిస్‌ కుమార్, డీఎంకే ఎమ్మెల్యే త్యాగరాజన్, వెటరన్‌ జర్నలిస్ట్‌ భాస్కర్, తమిళ మీడియా సంపాదకులు పాల్గొన్నారు. సదస్సులో మీడియాపై దాడులు, ప్రభుత్వాల తీరు, మీడియా సంస్థల్లో ప్రస్తుత పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top